Listen to this article

జనంన్యూస్. 17.సిరికొండ.శ్రీనివాస్ పటేల్

.సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్), నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదినాల సందర్భంగా మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ సాధనలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారని, బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజలకు సేవలందించిన నాయకుడని కొనియాడారు. ఇద్దరు నాయకులు ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు పొంది ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల కార్యకర్తలు, గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ నాయకులు మరియు అభిమానులు పాల్గొన్నారు.