Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 17, వికారాబాద్ జిల్లా

పరిగి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 72 జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. నేడు తెలంగాణ ఉద్యమ వీరుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టిన యోధుడు పది ఏళ్ల పరిపాలనలో రాష్ట్రన్నీ పేదరికం నుంచి, రైతే రాజు అని చెప్పుకునేలా చేసిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు, శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు,BRS పార్టీ సీనియర్ నాయకులు, నూతన కౌన్సిలర్ లు, యువ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.