జనం న్యూస్ 18 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
శాంతిభద్రతలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కలుగొట్ల గ్రామ సర్పంచ్…రాజకీయాలు ప్రస్తుతం రౌడీయిజంలా తయారయ్యాయని,సర్పంచ్ గ్రామంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ,గ్రామాభివృద్ధికి గ్రామస్తులతో కలిసి పనిచేయాలి అలాంటి బాధ్యత కలిగిన పదవిలో ఉంటూ గ్రామస్తుల పై దాడికి పాల్పడుతున్నారు వివరాల్లోకి వెళితే…ఉండవల్లి మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఆదివారం రోజున ఉదయం 7 :30 గంటల సమయంలో బీఆర్ఎస్ సర్పంచ్ దాడికి పాల్పడ్డాడు అదే గ్రామానికి చెందిన పరశురామ్ నాపై దాడి చేశాడని ఆయన ఆరోపించారు…కలుగొట్ల గ్రామ సర్పంచ్ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజా సేవకులుగా ఉండి ప్రజలకు సేవ చేయాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు,అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు,ప్రజా ప్రయోజనాలకి ప్రాధాన్యత ఇవ్వడం అత్యంత ముఖ్యం. కానీ ఇక్కడ మాత్రం ప్రజల పై దాడి చేయడం సరికాదని పలువురు విమర్శించారు…



