Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ జన్మదిన వేడుకలు ఎంపీ కార్యాలయంలో జరుగుతున్న కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు పాల్గొని కేక్ కటింగ్ చేయించి సీఎం రమేష్ సోదరుడు విజయ్ నాగ జగదీష్ కేక్ ను తినిపించారు. అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనకాపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అనకాపల్లికి వన్నె తెచ్చే విధంగా రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా అనకాపల్లి జిల్లాకి పారిశ్రామికంగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, నక్కపల్లి దగ్గర ఆర్సిలర్ నిప్పన్ ఉక్కు కర్మాగారం బల్క్ డ్రగ్ అచ్యుతాపురం సెజ్ లో అనేక పరిశ్రమలు రాబోతున్నాయని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే రెండు సంవత్సరాల్లో అనకాపల్లి జిల్లా మరింత అభివృద్ధి దిశగా ఉండేందుకు సీఎం రమేష్ పార్లమెంట్ సభ్యులు కృషి, ఉంటుందని నాగ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ద్వారపు రెడ్డి పరమేష్, పొన్నగంటి అప్పారావు,దాడి రత్నాకర్,మల్ల సురేంద్ర ,మల్ల సంతోష్ ,తదితరులు పాల్గొన్నారు