జనం న్యూస్ ఫిబ్రవరి 18 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని కే జి బి వి చిట్కుల్ మరియు జెడ్ పి హెచ్ ఎస్ ఫైజాబాద్ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థుల అంతర్గత మార్కుల పరిశీలన కార్యక్రమం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి విట్టల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు రమేష్ మరియు ధన మూర్తి సంబంధిత సబ్జెక్ట్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ ,మల్లేశం ,శేఖర్ పాల్గొన్నారు.ఈ పరిశీలన బృందం పాఠశాలల వారీగా విద్యార్థుల నోటుబుక్స్, ప్రాజెక్టులు, యూనిట్ టెస్టులు, ఫార్మేటివ్ అసెస్మెంట్లు తదితర రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. అంతర్గత మార్కులు నియమావళి ప్రకారం, కచ్చితత్వంతో నమోదు చేయాలని ఉపాధ్యాయులు సూచనలు ఇచ్చారు.ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ, “అంతర్గత మార్కులు విద్యార్థుల భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనవి. అందువల్ల ఉపాధ్యాయులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మూల్యాంకనం చేయాలి” అని తెలిపారు.అదేవిధంగా మార్చిలో జరిగే వార్షిక పరీక్షలలో విద్యార్థులు100% ఉత్తీర్ణత సాధించాలని దానికి అనుగుణంగా ఉపాధ్యాయులు ప్రణాళికల సిద్ధం చేసుకుని విద్యార్థులకు ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలి .వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ వహించి బోధన చేయాలని తెలియజేయడం జరిగింది .అదేవిధంగా ఈ పరిశీలన బృందానికి పాఠశాల సిబ్బంది పూర్తి సహకారం అందించారు


