జనం న్యూస్ ఫిబ్రవరి 18 ముమ్మిడారం ప్రతినిధి
ఇటీవల అనారోగ్య కారణాల వలన కాకినాడ అపోలో ఆసుపత్రిలో శాస్త్ర చికిత్స చేయించుకుని ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు నల్లా నరసింహామూర్తి ని మంగళవారం నల్ల స్వగృహంలో పరామర్శించిన మమ్ముడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పొన్నాల వెంకట సతీష్ కుమార్ .. ఈ సందర్భంగా పొన్నాడసతీష్ కుమార్ , నరసింహమూర్తితో మాట్లాడుతూ ఆరోగ్యం కుదిటపడే వరకు విశ్రాంతి తీసుకోవాలని,అనంతరం పార్టీ విధివిధానాలపై వైఎస్ఆర్సిపి నాయకులు తో, కార్యకర్తలతో మాట్లాడి పార్టీ బలోపేతానికి కార్యచరణ సిద్ధం చేయాలని నల్లా తో తెలిపారు.పార్టీలో యువతకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను మరొకసారి గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కొల్లాటి సత్యం,మండల జెడ్పిటిసి నేల కిషోర్ కుమార్,రాష్ట్ర నాయకులు వల్లభుని దొరబాబు,కాట్రేనికోన డాక్టర్ యూనియన్స్ అధ్యక్షులు వాసంశెట్టి శ్రీనివాసరావు,విప్లవ నాయకుడు నీలం బాలయోగి, కాట్రేనికోన మాజీ సొసైటీ అధ్యక్షులు జగడం బాలయోగి, కోపనాతి ప్రసాద్, పల్లం సర్పంచ్ మల్లాడి వీర బాబ్జి,అయితా బత్తుల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.


