జుక్కల్‌లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు , డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పాల్గొని – విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేశారు.
జుక్కల్ ఫిబ్రవరి 19 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండల కేంద్రంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు గురువారం రోజు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన దేశసేవలను ఘనంగా స్మరించుకున్నారు.ఈ కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు , కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హాజరై చత్రపతి శివాజీ మహారాజ్‌కు పూలమాలలు వేసి గౌరవం తెలిపారు. మహారాజ్ ధైర్యసాహసాలు, పరాక్రమం, దేశభక్తి నేటి తరానికి ఆదర్శమని వారు పేర్కొన్నారు.అనంతరం చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కొరకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రస్మరించుకున్నార తోట లక్ష్మీకాంతరావు , డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మాజీ జెడ్పిటిసి దాదారావు పటేల్ గుల్ల సర్పంచ్ మాధవరావు దేశాయ్, కల్లాలి రమేష్ దేశాయ్ జుక్కల్ మాజీ సర్పంచ్ రాములు సెట్ మాజీ సొసైటీ చైర్మన్ శివానంద్ పాల్గొన్నారు.ఈ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో మహారాజ్‌ను స్మరించుకున్నారు.




