జనం న్యూస్ ఫిబ్రవరి 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం లో వెలిసి యున్న శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో గురువారం ఉదయం ఇచ్చాపురం నైమిశారణ్య వారాహి పీఠాధిపతి బాల బ్రహ్మానంద సరస్వతి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనకు తీర్ద ప్రసాదంలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఆలయ మండపంలో శ్రీదేవి భాగవతతత్తవ్వ ప్రవచనాలు నిర్వహించారు. భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్ల బాబు), ఆలయ సహా కమిషనర్ యళ్ళశ్రీధర్,ఆలయ ధర్మకర్తలు సూరే సతీష్,దాడి రవికుమార్ పొలిమేర స్వాతి ఆనంద్, మారిశెట్టి శంకర్రావు,కాండ్రేగుల రాజారావు ,మజ్జి జానకి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్,వడ్డాది మంగ,కోనేటి సూర్యలక్ష్మి,యర్రవరపు సంతోష్ కుమారి, భక్తులు పాల్గొన్నారు.


