Listen to this article

జనం న్యూస్- ఫిబ్రవరి 18- నాగార్జునసాగర్ టౌన్-

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ జీవన్ బాబు గత కొన్ని సంవత్సరాలుగా పెరాల్సిస్ తో అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుండటంతో సహచర ఆటో డ్రైవర్ పరిస్థితిని గమనించిన స్థానిక ఆటో యూనియన్ సభ్యులు తమ వంతుగా కొంత మొత్తాన్ని ఆర్థిక సహాయంగా అందజేశారు. తమ సహచర ఆటో డ్రైవర్ పట్ల తమ ఔదార్యాన్ని చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో లోకల్ ఆటో యూనియన్ అధ్యక్షులు జి బద్రి, ఉపాధ్యక్షులు వలి, సహాయ కార్యదర్శి తిమ్ములు, సభ్యులు నరేష్, అభి, గని, ఉమ (అంబులెన్స్), రవి లు పాల్గొన్నారు.