Listen to this article

జనం న్యూస్- ఫిబ్రవరి 18- నాగార్జునసాగర్ టౌన్-

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ ఐదవ వార్డుకు చెందిన వల్లపు హనుమయమ్మ ఇటీవల కాలంలో గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకోగా ఆపరేషన్ వికటించటంతో తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం స్థానికుల ద్వారా తెలుసుకొని బాధితురాలికి ఆర్థిక సహాయం అందజేసిన విబిఎన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి నినన్, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితురాలకి వైద్య ఖర్చుల నిమిత్తం అధిక మొత్తం అవసరమవుతుందని కావున దాతలు సహకరించి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారి వెంట నిర్మల జానీ చుక్క, రాకం సైదేందర్ (చిట్టి), తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మాజీ టౌన్ అధ్యక్షులు కొల్లి రామకృష్ణారెడ్డి మందుల ఖర్చు నిమిత్తం బాధితురాలికి ఆర్థిక సహాయం అందజేశారు.