Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

చత్రపతి ధర్మరక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షులు కర్ర వేణుగోపాల్ ఆహ్వానం మేరకు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి ఉత్సవాలలో భాగంగా ముసాపేట్, గూడ్స్ షెడ్ రోడ్ లోని పినాకిల్ క్యాంపస్ లో జరిగిన రక్తదాన శిబిరానికి ప్రత్యేక అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ తల సేమియా సికిల్ సెల్ సొసైటీ డైరెక్టర్ రత్నావళి పినాకిని గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ వై శ్రీదేవి విచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్ర పటానికి పుష్పమాలలు అర్పించి ఘన నివాళులు అర్పించారు, అనంతరం ప్రేమ కుమార్ ని నిర్వాహకులు శాలువాతో సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ,’’శివాజీ మహారాజ్ ధైర్యం, పరాక్రమం, స్వాభిమానమే మనకు ఆదర్శం. యువత దేశభక్తితో, నైతిక విలువలతో ముందుకు సాగాలి అని పేర్కొని, రక్త దానం చేసిన యువతకు సర్టిఫికెట్, పండ్లు ఇచ్చి, ఒక రక్తదానం ద్వారా 3 మంది ప్రాణాలను రక్షించే అవకాశం ఉంటుంది.తలసేమియా, ప్రమాదాలు, శస్త్రచికిత్సలు వంటి అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎంతో అవసరం అని యువతను,నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, బొగాది వెంకటేశ్వరరావు, వేముల మహేష్, పోలెబోయిన శ్రీనివాస్, మరియు చత్రపతి ధర్మ రక్షణ సేన ఉపాధ్యక్షులు గాలి అనిత,తాండూర్ సునీత, తాండూర్ శ్రీనివాసరాజు, నాగేశ్వర్ గుప్తా, పవన్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.