Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 19

ఎడ్లపాడు మండలంలోని కొండవీడు పరిసర ప్రాంతాలలోఈ నెల 7,8 తేదీలలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన కొండవీడు ఫెస్ట్ ఉత్సవాలు అద్భుత విజయాన్ని సాధించాయి .ఈ ఉత్సవాలు తిలకించటానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకులు, స్థానిక ప్రజలు వేలాదిగా తరలివచ్చారు . కొండవీడు చరిత్ర ప్రతిబింభించే విధంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవాలను పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల స్థానిక mla ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఇంతటి మహాత్తరమైన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేసినందుకు స్థానిక ఎడ్లపాడు మండల సబ్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణను నాదెండ్ల మండల సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు లను బీజేపీ పార్టీ నాయకులు ఘనంగా సన్మానం చేసారు ఈ సందర్భంగా విధులు నిర్వహించిన అధికారులు అందరికీ అభినందనలు తెలియజేసారు ఈ కార్యక్రమం లో
బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు తులాబందుల సత్యనారాయణప్రధాన కార్యదర్శి
దాట్ల వెంకటేశ్వరరాజుమండల ఉపాధ్యక్షులు అయిలవరపు రామారావు,SC మోర్చా అధ్యక్షులు బందెల శ్రీనివాసరావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు నక్క వెంకట దుర్గ చక్క ఆంజనేయులు నేలటూరి ఏసురత్నం బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు నక్క శ్రీనివాస్ మొదలగు వారు పాల్గొన్నారు