జనం న్యూస్ ఫిబ్రవరి 19: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్లమండలకేంద్రంలోని మండల పరిషత్ ప్రత్యేక అధికారి శివకృష్ణ గురువారం ఎస్సీ బాయ్స్ హాస్టల్, కేజీబీవీ స్కూల్ మరియు భవిత కేంద్రాన్ని ఆకస్మికంగాపరిశీలించారు.ఈ సందర్భంగా పిల్లలకు అందిస్తున్న ఆహారం నాణ్యంగా,పోషకాహారంతో ఉండాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హాస్టల్ వార్డెన్‌కు మరియు కేజీబీవీ స్కూల్ సిబ్బందికి సూచనలు జారీ చేశారు.అలాగే హాస్టల్ గదులు, టాయిలెట్లు, కేజీబీవీ స్కూల్ తరగతి గదులు శుభ్రంగా ఉంచాలని, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అన్ని విభాగాలను పూర్తిగా పరిశీలించి అవసరమైన సూచనలు ఇచ్చారు.ఈకార్యక్రమంలో ఎంపీడీవో, ఎంఈఓ, ఐడబ్ల్యూ, ఐడీసీ, ఏఈ, హాస్టల్ వార్డెన్, కేజీబీవీ స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


