జుక్కల్ ఫిబ్రవరి 19 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలోని కౌలస్ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సేవా కార్యక్రమం నిర్వహించారు. జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారు, కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి సతీమణి శ్రీమతి అర్చన గారి సహకారంతో విద్యార్థులకు షూస్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులు కొత్త షూస్ అందుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు కార్యక్రమానికి హాజరై నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం ఆనందంగా ఉందని నాయకులు పేర్కొన్నారు.


