Listen to this article

జుక్కల్ ఫిబ్రవరి 19 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్దూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల చిత్ర కళ ఉపాధ్యాయుడు భాస బాలకిషన్ తన సృజనాత్మకతను మరోసారి చాటుకున్నారు. చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని కొత్తిమీర, వివిధ రకాల కూరగాయలతో శివాజీ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు. దేశ సంస్కృతి రక్షణకు శివాజీ చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. బాలకిషన్ ప్రతిభను చూసి పాఠశాల సిబ్బంది స్థానికులు ప్రశంసల వర్షం కురిపించారు.