Listen to this article

ఫిబ్రవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సహకార సంఘాల ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. జీవో నంబర్ 36ను వెంటనే అమలు చేయాలని, సహకార సంఘాలను ప్రైవేటీకరణ చేయవద్దని డిమాండ్ చేస్తూ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కార్యాలయం వద్ద సహకార సంఘాల ఉద్యోగులు భారీగా చేరుకుని ఆందోళన నిర్వహించారు.ఉద్యోగుల వయోపరిమితిని పెంచాలని, వేతన సవరణ వెంటనే అమలు చేయాలని, అలాగే డి.ఎల్.ఎస్.ఎఫ్ ఏర్పాటు చేయాలని కోరారు.అదేవిధంగా, ఉద్యోగులకు చట్టప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే అందించాలని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.డ్యూయల్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ప్రధాన డిమాండ్‌గా పేర్కొన్నారు
ఈ ఆందోళనలో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు పాల్గొని ఉద్యోగులకు మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు య ర్రం శెట్టి రామచంద్రరావు
ఉద్యోగులు అప్పారి సత్య ప్రేమేశ్వరరావు, కోటిపల్లి శ్రీ రామ వర ప్రసాద్, కోటిపల్లి సీతారామారావు, గుత్తుల వెంకట శ్రీనివాస్, విత్తనాల శంకర్, గుబ్బల నాగేంద్ర కుమార్, యర్రంశెట్టి నాని, మల్లాడి కృష్ణ మూర్తి, గొల్లపల్లి శ్రీను,సత్తిబాబు,నాగభూషణం, వెంకటేష్, కిరణ్ శరత్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు
డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ