Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

డా.బి. ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు,అమలాపురం డీఎస్పీ టి ఎస్ ఆర్ కె ప్రసాద్, ముమ్మిడివరం మోహన్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి కాట్రేని కోన మండలం గచ్చకాయల పొర గ్రామంలో”పల్లె నిద్ర” కార్యక్రమాన్ని నిర్వహించారుగురువారం రాత్రి ఆయన పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తేలుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొని గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు, తాగునీటి సమస్య,, విద్యుత్ సమస్యలు, శాంతి భద్రతల పరిరక్షణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.అధికారులు ప్రజలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. గ్రామంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని, ప్రజల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎస్సై అవినాష్ .ప్రజలతో సాన్నిహిత్యం పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు గ్రామాభివృద్ధికి దోహదపడతాయని గ్రామస్థులు అభిప్రాయపడి అధికారుల చర్యలను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఐ.అవినాష్,పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు,స్థానిక యువత మరియు పీస్ కమిటీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.