జనం న్యూస్ 20 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
మీడియా ప్రతినిధుల వివరణకు స్పందించిన హన్మంతు నాయుడు.. సోషల్ మీడియా ప్రచారాలపై సీరియస్!
గద్వాల: గద్వాల మున్సిపల్ ఎన్నికల అనంతరం సోషల్ మీడియాలో జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హన్మంతు నాయుడు క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు ఆయనను కలిసి వివరణ కోరడంతో, ఆయన ఘాటుగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు నాలుగో స్తంభం వంటి వారని, వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని ఆయన పేర్కొన్నారు.మీ వివరణ కోరిన మీడియా.. స్పందించిన ఇంచార్జి మున్సిపల్ ఫలితాల తర్వాత జర్నలిస్టులపై సోషల్ మీడియా వేదికగా కొందరు చేస్తున్న అనుచిత వ్యాఖ్యల వల్ల జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతిన్నాయని మీడియా ప్రతినిధులు హన్మంతు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన స్పందిస్తూ, విలేకరులపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, అక్షర యోధులపై ఇటువంటి నిందలు వేయడం సంస్కారం కాదని మండిపడ్డారు.
ఆ పోస్టులకు పార్టీకి సంబంధం లేదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనుచిత పోస్టులకు బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరో వ్యక్తిగత ద్వేషంతో చేసే వ్యాఖ్యలను పార్టీకి ఆపాదించడం సరికాదని, విలేకరులు రాసే నిజాలకు తాము ఎప్పుడూ గౌరవం ఇస్తామని తెలిపారు. సమాజంలోని లోపాలను ఎండగట్టడం జర్నలిస్టుల బాధ్యత అని, దాన్ని తప్పుగా చూడాల్సిన అవసరం లేదని ఆయన హితవు పలికారు.అనుచిత ప్రచారం చేస్తే కఠిన చర్యలు!”బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ఎవరైనా సరే, కావాలనే జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్నారని తెలిస్తే వారిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం” అని బాసు హన్మంతు నాయుడు హెచ్చరించారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రవర్తించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. జర్నలిస్టులు ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడి నిష్పక్షపాతంగా పనిచేయాలని, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ మీడియాకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.


