జనం న్యూస్ ఫిబ్రవరి 23 ప్రతినిధి గ్రంధి నానాజీ
డా,, బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఖండ జి.వేమవరం గ్రామంలో ఈ రోజు ఉదయం గో పూజ & భూమి సుపోషణ మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా చంద్రాబట్ల రామకృష్ణ శర్మ గణపతి పూజ, గో పూజ అనంతరం భూమి సుపోషణ (మృత్తికా పీఠ ఆరాధన) నిర్వహించారు.స్థానికి రైతులు వారి వారి వ్యవసాయ క్షేత్రం నుండి సేకరించి తీసుకువచ్చిన మృత్తికతో ధర్మ ప్రచారకులు బొంతు కనకారావు మృత్తికా పీఠాన్ని సుందరంగా నిర్మించాగా, శ్రీ నల్లా తాతాజీ శ్రీమతి క్రాంతి దంపతులు యజమాని దంపతులుగా పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న గ్రామ వికాస్ ఆంధ్ర రాష్ట్ర నాయకులు తిరుపతయ్య మాట్లాడుతూ గోపూజ విశిష్టత తోపాటు గోవు పరిరక్షణ మన బాధ్యత అని, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా మరియు గో ఆధారిత ఉత్పత్తులు వినియోగించడం ద్వారా మన ఆరోగ్యం రక్షించుకోవాలని,ప్రకృతికి హానికరమైన ప్లాస్టిక్ కవర్లు, డిస్పాజిబుల్ వస్తువులు వినియోగం తగ్గించి ప్రతి గ్రామంలోనూ స్టీల్ బ్యాంక్ నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించాలని పిలుపునిచ్చారు.
భూ సుపోషణ అనగా మృత్తికను పూజించి తద్వారా భూమిని సారవంతంగా తయారు చేసుకోవడానికి సంకల్పించుకోడమేనని వివరించారు.అనంతరం గోదావరి జిల్లాల సంయోజకులు చింతాకుల గోపాలకృష్ణ అందరిచే భూ సుపోషణ విశేష సంకల్పం చెప్పించారు. ఈ అభియాన్ లో భాగంగా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ మార్చి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామానా నిర్వహించే గో పూజ & భూమి సుపోషణ మహోత్సవం గురించి వివరించి పెద్దల సమక్షంలో కరపత్ర ఆవిష్కరణ చేయించారు. కార్యక్రమ అనంతరం రైతులకు మృత్తికా ప్రసాదం మరియు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గొలకోటి వెంకట రెడ్డి, గ్రామ వికాస్ జిల్లా నాయకులు సలాది శ్రీనివాస్, రెల్లు గంగాధరం, నంద్యాల నర్సింహ స్వామి, మద్దింశెట్టి పురుషోత్తం, నల్లా అన్నబాబు, నల్లా తాతాజీ,మద్దింశెట్టి రాజబాబు, సన్నిధిరాజు వీరభద్ర శర్మ, దంగుడుబియ్యం శ్రీనివాసరావు, తటవర్తి నాగరాజారావు, చోడిశెట్టి నాగు, కోన ప్రసాద్, మద్దింశెట్టి సతీష్, తాళ్లూరి వేంకట కృష్ణమూర్తి, బల్ల గోపీ, కోల కృష్ణ, రేవు సింహాచలం, గుత్తుల త్రిమూర్తులు, పోతాబత్తుల చిన వెంకట్రావు, పోతాబత్తుల శ్రీను, పోతుల శ్రీరంగం, పోతుల కోఠిబాబు, మద్దింశెట్టి శ్రీనివాసరావు మరియు అధిక సంఖ్యలో మాతృమూర్తులు రైతులు గ్రామస్తులు పాల్గున్నారు.



