Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 21 అమలాపురం,:భారతీయ జనతా పార్టీ విస్తరణకు విశేష సేవలు అందించిన బీజేపీ సీనియర్ నాయకులు వారణాసి సూర్యనారాయణ మూర్తి 34వ వర్ధంతిని బిజెపి శ్రేణులు కోనసీమ ముఖ్య పట్టణంలో శుక్రవారం నిర్వహించారు. స్థానిక యర్రమెల్లివారి వీధిలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు యర్రమెల్లి పాండురంగారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ కోనసీమ శాఖ పూర్వ అధ్యక్షులు యాళ్ల దొరబాబు వారణాసి సూర్యనారాయణ మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు భక్తిపూర్వకంగా పుష్పాంజలి ఘటించి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు ఆర్.వి. నాయుడు మాట్లాడుతూ, వారణాసి సూర్యనారాయణ మూర్తి ఉభయ గోదావరి జిల్లాలలో భారతీయ జనతా పార్టీని విస్తరించడంలో కీలక పాత్ర పోషించారని, వందలాది మంది నాయకులను తయారు చేసిన గొప్ప నేతగా ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఇంచార్జి కర్రి చిట్టిబాబు, మోకా వెంకట సుబ్బారావు, సంసాని రత్నకుమార్, గుమ్మళ్ల రెడ్డి నాయుడు, కర్రి తాతారావు, అరిగెల తేజా వెంకటేష్, దూరి రాజేష్, దాట్ల సుబ్బరాజు, బొంతు శివాజీ, కట్టా నారాయణమూర్తి, డేగల రాఖి, కట్టా జనార్ధనరావు, పేరాబత్తుల సుబ్బరావు, మూళ్ల సాంబశివ శర్మ, నల్లా సత్తిబాబు, మేకల చంటి రాయపురెడ్డి, బైరవ మూర్తి, గాడి సత్తిబాబు, చిల్లా పురుషోత్తం తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.