Listen to this article

జనంన్యూస్. 22.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాదు. రురల్ సిరికొండ. రాష్ట్రంలో ఎంపిటిసి , జడ్పీటీసీ వ్యవస్థల భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలలో ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామీణ రాజకీయాల్లో ఎంపిటిసి, జడ్పీటీసీ మరియు సర్పంచ్ పదవులు కార్యకర్తలకు ప్రజలతో మమేకమై సేవ చేసేందుకు దొరికే గొప్ప వేదికలు. ఎంతో మంది యువ నాయకులు ఈ పదవుల ద్వారానే రేపటి తరం నాయకులుగా ఎదగాలని ఆశిస్తున్నారుఒకవేళ ఈ వ్యవస్థలను బలహీనపరిస్తే, క్షేత్రస్థాయిలో పార్టీని కాపాడుతున్న కార్యకర్తల ఉత్సాహం దెబ్బతినే ప్రమాదం ఉంది. రాజీవ్ గాంధీ. ఆశించిన అధికార వికేంద్రీకరణను కొనసాగిస్తూ, స్థానిక సంస్థల ఎన్నికలను యథావిధిగా నిర్వహించి, కార్యకర్తలకు సముచిత రాజకీయ అవకాశాలు కల్పించాలి. కార్యకర్తల ఆశయాలను గౌరవించినప్పుడే కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పార్టీ అధిష్టానం కార్యకర్తల. పక్షాన నిలిచి సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తు.రాము మొట్టలవైస్ ప్రెసిడెంట్, సిరికొండ మండల యూత్ కాంగ్రెస్.