Listen to this article

జనం న్యూస్ 23 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

సియం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రానున్న అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.
అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.రైతులకు ఆర్థిక సాయం అందించే ‘రైతు భరోసా’ పథకం నిధుల విడుదలపై కూడా కేబినెట్‌లో చర్చ జరగనుందని సమాచారం. ఈ అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.కేబినెట్ సమావేశం నేపథ్యంలో అధికార వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.