.జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 23
పర్యావరణ పరిరక్షణలో పాములు కీలక పాత్ర పోషిస్తాయని, వాటిని చంపడం కంటే సంరక్షించడం మిన్నని మార్కాపురం వన్యప్రాణి విభాగం స్నేక్ క్యాచర్ నిరంజన్ అన్నారు. తర్లుపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, పర్యావరణ విద్యలో భాగంగా “పాములు – పర్యావరణ హితకారులు” అనే అంశంపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నిరంజన్ విద్యార్థులకు వివిధ రకాల పాములను చూపిస్తూ వాటి లక్షణాలను వివరించారు. ముఖ్యంగా:విషపూరిత మరియు విషరహిత పాములు పై ఏ పాములు ప్రమాదకరమైనవి, ఏవి కావుఅనేవిషయాలనువిద్యార్థులకు వివరించారు.పాముకుట్టినప్పుడుభయపడకుండా తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తల గురించి చెప్పారు. పాము కాటుకు నాటు వైద్యం చేయించుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండే ‘పాలివినం ఏ ఎన్ టి ఐ వి ఈ ఎన్ ఓ ఎం మందు ప్రాణాలనుకాపాడుతుందనివివరించారు.వన్యప్రాణులపైవిద్యార్థులకుఉన్నభయాందోళనలను తొలగించి, వారిలోఅవగాహనకల్పించిననిరంజన్‌నుపాఠశాలప్రధానోపాధ్యాయులుయం.సుధాకర్,విద్యాశాఖఅధికారిఅచ్యుత్.సుబ్బారావుఅభినందించారు.ఈకార్యక్రమంలోఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


