హంతకులందరిని 24 గంటలలోపే అరెస్టు చేయాలి
హత్య నేరం కింద కేసు నమోదు చేయాలి
రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని కుటుంబానికి న్యాయం చేయాలి
కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను
జనం న్యూస్: ఫిబ్రవరి 23 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసిబిడ్డను అత్యంత క్రూరంగా అమానవీయంగా కాలితో తన్ని హత్య చేసిన ఆ గ్రామ అగ్రకుల పెత్తందారులు శ్రీనివాస్ రెడ్డి మధుసూదన్ రెడ్డి సతీష్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి కన్నిరెడ్డి మరికొందరిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతోపాటు హత్యా నేరం కింద కేసు నమోదు చేసి 24 గంటల్లో తక్షణమే రిమాండ్ చేయాలని హాలియ కేంద్రంలో సోమవారం కే వీ పి స్ ,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్న నేటికీ దళిత, గిరిజన, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలపై దాడులు, హత్యలు అత్యాచారాలు, సాంఘిక బహిష్కరణలు కొనసాగుతున్నాయని, పండగలు ఉత్సవాలలో కులవివక్ష అగ్రకుల దురహంకారంతో ప్రజల మధ్య కులవిద్వేషాలు సృష్టంచడం, దేవుడి దగ్గర అందరూ సమానము కాదని అహంకారము ప్రదర్శించడంవల్ల ఈ ఘటన జరిగిందన్నారు, దేవుని దగ్గరికి వెళ్లడానికి 100 రూపాయలు ఫీజు ఎందుకు చెల్లించాలని ప్రశ్నించిన పాపానికి, చెల్లిస్తాం కానీ రషీద్ ఇవ్వండని అడిగినందుకు సుమారు మూడున్నర గంటలపాటు గణేష్ అనే యువకుడిని చితక బాధారని చెప్పారు. తన భర్తను కొట్టవద్దని తన తమ్ముడిని కొట్టవద్దని గణేష్ అక్క కీర్తి భార్య మౌనిక ఎంతగా బ్రతిమిలాడిన కాళ్లు మొక్క డానికి ప్రయత్నం చేసిన కాళ్లతో తన్నారు తప్ప కనికరించలేదు రెండు నెలల పసిబిడ్డ ఉంది నా భర్తను కొట్టకండి చంపకండి అని వేడుకున్న చివరికి ఏమాత్రం కనికరం లేకుండా అమానవీయంగా మానవ మృగంలా రెండు నెలల పసిబిడ్డపై కూడా కాలితో తన్ని క్రూరంగా పసిబిడ్డను హత్య చేశారని చెప్పారు ఈ ఘటన సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా మానవత్వాన్ని మంటగలిపే విధంగా ఉందన్నారు సంఘటన ఈ నెల 18న జరిగితే పోలీసులు బాధితులే అగ్రకుల పెత్తందారులపైన దాడి చేసినట్లుగా బాధితులపై కేసులు నమోదు చేయడం సిగ్గుచేటు అన్నారు బాధితులను వెంటబడి వెంబడించి దాడి చేసి చెప్పరాని బూతులు తిట్టి కాలుతో తన్ని పసిబిడ్డను హత్య చేసిన హంతకులను మాత్రం పోలీసులు ఒక కంటకనిపెట్టారని చెప్పారు,చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పే పోలీసులు హంతకులకు న్యాయం బాధితులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు బాధితులకు న్యాయంచేసే క్రమంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. డిఎస్పీ శ్రీనివాస్ ముందు హంతకులపై కేసు నమోదు చేయాల్సి ఉండగా బాధితులపై కేసు పెట్టారని చెప్పారు. 8 మందిపై ఫిర్యాదు చేస్తే నలుగురిని మాత్రమే అరెస్టు చేశారని మిగతా వాళ్లను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు ఉన్నాయన్నారు హత్య జరిగితే ముందస్తు మర్డర్ గా అటెంప్ట్ మర్డర్ గా కేసు నమోదు చేయడం విడ్డూరమన్నారు. హత్య జరిగిందని పసిబిడ్డను చంపారని క్లియర్ గా సభ్య సమాజం గుర్తించినప్పటికీ పోలీసులు గుర్తించినట్లుగా లేదన్నారు. తక్షణమే హత్యా నేరం కింద 103 సెక్షన్ పెట్టాలని, ఈ ఘటనలో పాల్గొన్న వాళ్లందర్నీ తక్షణమే అరెస్టు చేయాలని లేని ఎడల కెవిపిఎస్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దైద శ్రీను, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు కారంపూడి ధనమ్మ, వ్యాకస జిల్లా సహాయ కార్యదర్శి జటావత్ రవి నాయక్, కెవిపిఎస్ జిల్లా నాయకులు దొంతాల నాగార్జున దొరేపల్లి మల్లయ్య, రజక సంఘం జిల్లా నాయకులు రెబెల్లి వెంకటేశ్వర్లు,మేకల వెంకన్న, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు తరి రామకృష్ణ, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి కోరే రమేష్, , పొదిల వెంకన్న, వర్షిత్, అనుముల దుర్గయ్య ఖమ్మంపాటి సైదులు అనుముల అనిల్ జానకి రాములు గోలి శంకర్
తదితరులు పాల్గొన్నారు


