Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 23 సెల్ 9550978955

నరసరావుపేట: విద్యార్థినినీ విచక్షణ రహితంగా దండించిన పాఠశాల డైరెక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ డిమాండ్ చేశారు. నరసరావుపేట పట్టణం పరిధిలోని ప్రకాష్ నగర్ లో గల ప్రైవేట్ పాఠశాలలో పట్టణంలోని ఏనుగుల బజారుకు చెందిన మైనార్టీ విద్యార్థిని పదోతరగతి చదువుతుందన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్న బాలికను అకారణంగా దండించటమే కాకుండా, ఒత్తిడి లేని విద్యా హక్కుకు భంగం కలిగించారన్నారు. క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాల డైరెక్టర్ విద్యార్థినిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. చిన్నారుల భద్రతను కాపాడాల్సిన విద్యాసంస్థలో ఇలాంటి అమానుష ఘటన చోటుచేసుకోవడం అత్యంత దురదృష్టకరమన్నారు.విద్యార్థిని పట్ల జరిగిన దౌర్జన్యం విద్యా వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే చర్యగా భావిస్తున్నామన్నారు. పాఠశాలల్లో పిల్లలపై శారీరక శిక్షలు నిషేధం అయినప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం బాధాకరమన్నారూ. ఘటనపై బాధితురాలు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించాలని సంబంధిత అధికారులు, జిల్లా విద్యా అధికారి వెంటనే స్పందించి సంఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన పాఠశాల డైరెక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారూ.ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని పాఠశాలల్లో కఠిన నియంత్రణలు అమలు చేయాలని, విద్యార్థుల భద్రతకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి మరియు డిమాండ్ చేస్తున్నా మనీ అన్నారు. విద్యార్థినికి మద్దతుగా నిలిచిన పలు సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.