Listen to this article

జనం న్యూస్ 24ఫిబ్రవరి పెగడపల్లి జగిత్యాల జిల్లా

పెగడపల్లి మండలం ఎల్లాపూర్ రైతు వేదిక లో రైతుల ఆదాయం పెంపు, ఖర్చుల తగ్గింపు మరియు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా సహజ వ్యవసాయం మరియు నానో ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సహజ పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా భూసారాన్ని మెరుగుపరచడం, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడం వల్ల లాభాలు వివరించారు. నానో యూరియా మరియు నానో డిఏపీ వంటి నానో ఎరువులు తక్కువ మోతాదులోనే పంటలకు సమర్థవంతమైన పోషకాలు అందిస్తాయని, ఖర్చు తగ్గడంతో పాటు దిగుబడులు పెరగడంలో సహాయపడతాయని తెలిపారు. అలాగే పర్యావరణానికి హాని తగ్గి, నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు.రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందేహాలు నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల వ్యవసాయ అధికారీ మండల రాజ్ కుమార్, పెగడపల్లి మండల వ్యవసాయ అధికారీ శ్రీకాంత్ ఎల్లపూర్ సర్పంచ్ రాజేశం, రాజరంపల్లి సర్పంచ్ రమేష్ ఏ ఇ ఓ అక్షయ్ మరియు రైతులు పాల్గొన్నారు.