Listen to this article

ఇంటింటికి తిరిగిన చైర్మెన్ కృష్ణారెడ్డి కౌన్సిలర్ కోరబోయిన సరస్వతి

జోగిపేట మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో మంగళవారం నాడు వార్డు కౌన్సిలర్ కోరబోయిన సరస్వతి ఆధ్వర్యములో ఇంటింటికి తిరుగుతూ వార్డులోనీ పారిశుధ్య సమస్య ,విధి దీపాల,కరెంట్ స్తంభాల సమస్యను వార్డుకు వచ్చిన చైర్మెన్ కృష్ణారెడ్డి దృష్టికి తీసుకు వెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే సమస్యకు పరిష్కారం చెయ్యాలి అని మున్సిపల్ అధికారులకు ఆదేశించడం జరిగింది. చైర్మెన్ యస్ కృష్ణారెడ్డి 12వ వార్డులో ఇంటింటికి కలసి తిరుగుతూ వార్డు ప్రజలు చెప్పే సమస్యలను వింటూ ఆయన వెంట వచ్చిన మున్సిపల్ అధికారులకు తెలియచేసి పరిష్కారం దిశగా కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు.వార్డులో ముఖ్యమైన సమస్య అయిన దాకూరి రోడ్ నుండి రాజరాజేశ్వర మందిరము వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్,అలాగే వార్డులోని ముఖ్య సమస్యగా ఉన్న కందకం పైన సీసీ రోడ్ కావాలి అని అడగగా మంత్రిగారి కృషితో త్వరలోనే ఆ సమస్యకు పరిష్కారం దిశగా వెళ్తాము అని అన్నారు. వార్డులోనీ ఇండ్లు లేని నిరుపేద కుటుంబలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదర్శ వంతమైన వార్డుగా తీర్చిదిద్దుతం అని వార్డు చైర్మెన్ కృష్ణారెడ్డి కౌన్సిలర్ కోరబోయిన సరస్వతికి హామీఇచ్చారు.వార్డు పర్యటనలో భాగముగా చైర్మెన్ ఎస్. కృష్ణారెడ్డి వెంట వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) మాజీ కౌన్సిలర్ సురేందర్ గౌడ్,పట్లోల్ల ప్రవీణ్,నాగరాజ్ (నాని) నాయకులు ఉల్వల శ్రీనివాస్,దుర్గేశ్,మల్లేశం, భీమ్ రాజ్, కడల మల్లేశం, సయ్య కార్తీక్,అల్లే రాకేష్ మున్సిపల్ అధికారులు నాగులపల్లి అంజయ్య, మహేందర్,వర్షిణి, తదితరులు పాల్గొన్నారు.