తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ 24 ఫిబ్రవరి
15,17 వార్డు ప్రజల నిండు ఆశీస్సులు చిట్టిబాబుకే జోగిపేటః మున్సిపల్ ఎన్నికల్లో అన్ని విధాలా సమర్థుడైన ఆకుల చిట్టిబాబు ముదిరాజ్‌కు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి దక్కడం వందకు వంద శాతం కరెక్టేనని చెప్పవచ్చు. 17వ వార్డులో ఐదేళ్లపాటు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఆయనకు ఈ సారి ఆ వార్డులో పోటీ చేసే అవకాశం దక్కకపోయినా పోటీ చేసిన 15వ వార్డులో కూడా 200కు పైగా మెజార్టీ రావడం గతంలో పనిచేసిన వార్డు ప్రజల ఆశీస్సులు ప్రజల దీవెనలని చెప్పవచ్చు. 17వ వార్డులో కూడా చిట్టిబాబుకే ఓటు వేస్తున్నామని మనస్సులో అనుకొని మరీ ఎస్‌టీ రిజర్వుడు అభ్యర్థిని గెలిపించుకోగలిగారు. చిన్న వయస్సులోనే మున్సిపాలిటీలోని ఉన్నత పదవిని దక్కించుకోవడం 17,15 వార్డు ప్రజల ఆశీస్సులేనని చెప్పవచ్చు. భవిష్యత్తులో చిట్టిబాబు మరిని ఉన్నత పదవువులు సాధించాలన్నదే ఈ రెండు వార్డు ప్రజల కోరిక. కళాశాల నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న చిట్టిబాబుకు అనుకోకుండా రాజకీయ రంగ ప్రవేశం చేసి పదవులకు ఎన్నిక కాగలిగారు. చిట్టిబాబుకు ఉన్న కమిట్‌మెంట్‌ను గుర్తించిన మంత్రి దామోదర ఆశీస్సులను కూడా పొందగలిగారు. మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో రెండు వార్డుల్లో తన ప్రభావం ఉందని నిరూపించుకోగలిగిన నాయకుడు చిట్టిబాబు. పదేళ్లపాటు ఆయన పార్టీ కోసం చేసిన శ్రమ వృధా కాకుండా గుర్తింపుగా దక్కిందే మున్సిపల్ వైస్ చైర్మన్ పదవియని చెప్పవచ్చు.


