Listen to this article

జనం న్యూస్, ఫిబ్రవరి 24, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి :

పట్టణంలోని గత రెండు రోజుల నుంచి మంచినీరు మరియు తాగునీటికి సరపరలో అంతరాయం కలగడంలో 15 వ వార్డు సభ్యులు వార్డు కౌన్సిలర్ అయిన అరిగెల అనుష రాకేష్ కి తెలియపరచగా వెను వెంటనే స్పందించిన కౌన్సిలర్ అనూష రాకేష్ ట్యాంకర్లలో నీటిని తెప్పించి నిరు సరఫరా అంతరాయం కలిగిన ఏరియా లో ఇంటింటికి దగ్గరుండి మరి నీటిని అందించడం జరిగింది, ఈ నీటి సమస్యను కూడా తొందరగా పరిష్కారం చేస్తానని వార్డు ప్రజలకు తెలియజేశారు, వార్డులో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాల్సిందిగా ప్రజలను కోరారు, నీటిని ఇంటింటికి తీసుకువచ్చి నీటి సమస్యను తీర్చినందుకుగాను వార్డు సభ్యులు వార్డు కౌన్సిలర్ అరిగెల అనుష రాకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు