జనంన్యూస్. 24. సిరికొండ. శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ సిరికొండ మండలపరిధిలోని న్యవనంది గ్రామ ఉన్నత పాఠశాలలో PET టీచర్ గా విధులు నిర్వహిస్తున్న సిద్దు డిప్యూటేషన్ పైన పోతంగల్ ఉన్నత పాఠశాలకు వెళ్లారు , కానీ ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని గ్రామాభివృద్ధి కమిటీ దాతల సహాయంతో సుమారు 12 లక్షల వరకు స్కూలు అభివృద్ధికి సహకరించి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచి భవిష్యత్తులో న్యవనంది ఉన్నత పాఠశాలను జిల్లా లోనే అగ్రగామిగా ఉంచాలానే సంకల్పం తో వేరే పాఠశాలతో మాదిరి కాకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ కుటుంబ అవసరాల నిమిత్తం వెళ్లినటువంటి పీఈటి టీచర్ అక్కడే విధులు నిర్వహించడాన్ని గ్రామస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాఠశాలకు అన్ని విధాల సహకరిస్తున్నామని మా పాఠశాలకు సంబంధించిన PET ని జడ్పిహెచ్ఎస్ న్యవనంది లోనే విధులు నిర్వహించే విధంగా అనుమతించలని లేకపోతే కొత్తవారిని నియమించి ,పాఠశాల అభివృద్ధికి సహకరించాలని DEO దృష్టికి జనవరి 20 నాడు మామిడి కింది మైపాల్ వెళ్లి కోరగా డీఈఓ స్పందించి డిప్యూటేషన్ రద్దుచేసి న్యవనందిలోనే విధులు నిర్వహించాల్సిందిగా ఆర్డర్ ఇచ్చారు కానీ ఇంతవరకు ఆర్డర్ అమలు కాలేదని పిఈటి సిద్దు టీచర్ ఉన్నత పాఠశాలకు రాలేదని వాపోయారు వెంటనే ఉన్నతాధికారులు స్పందించి పిఈటి టీచర్ ను పాఠశాలకు నియమించవలసిందిగా కోరుతున్నారు.


