Listen to this article

జనంన్యూస్. 24.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాదు రురల్.నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషమని నిజామాబాద్ బాద్ రూరల్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బండారి నరేష్ అన్నారు జాతరకు వెళ్లిన రజక దంపతులు గణేష్ మౌనిక రెండు నెలల వారి పసిబిడ్డ తల్లి చెల్లిపై దాడి చేయగా ఈ దాడిలో పాప ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారణకరం అత్యంత విషాదకరమైన మరియు ఈ ఘటనపై మనం బీసీలమందరము ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ యొక్క దారుణానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని మునుముందు బీసీలకు అండగా ప్రభుత్వం నిలవాలని ఈ సందర్భంగా బండారి నరేష్ డిమాండ్ చేశారు జై బీసీ జై జై బీసీ