జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 24 సెల్ 9550978955
ఏపీలో జగన్ కో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నం చేయడం ఆందోళన కలిగిస్తుంది అని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.24-02-2026 మంగళవారం ఉదయం పదకొండు గంటలకు గుంటూరు లాడ్జి సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.గుంటూరుకు చెందిన నవతరం పార్టీ సీనియర్ నేత పోకూరి కవితను జాతీయ అధికార ప్రతినిధి గా నియమిస్తూ ఉత్తర్వులు ఆమెకు స్వయంగా అందించారు.పదమూడు సంవత్సరాలనుండి ఆమె పార్టీకి అందిస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకుని ఆమెను జాతీయ స్థాయి పదవికి ఎంపిక చేసినట్లు తెలిపారు.కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరిస్తామని తెలిపారు. జగన్ టీమ్ చేస్తున్న కుట్రలు తిప్పికొట్టెందుకు నవతరం పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలి అన్నారు. గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తే ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పికొట్టిందని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు ఇటువంటి ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటు అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, బీజేపీ అధ్యక్షులు పి వి ఎన్ మాధవ్ నేత్రుత్వంలో కూటమి సంక్షేమ పాలన అందిస్తోందని రావు సుబ్రహ్మణ్యం అన్నారు. కార్యక్రమంలో నవతరం పార్టీ నేతలు పాల్గొన్నారు.


