జనం న్యూస్ ఫిబ్రవరి 24 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )
లారీ ఢీకొని మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ సమీపంలో కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై అక్కినేపల్లి ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కనుకుల గిద్ద గ్రామానికి చెందిన తోకల ప్రభాకర్ రెడ్డి, రేణుక లు కలిసి పనిమీద హనుమకొండకు వెళుతున్న క్రమంలో, వెనుక నుండి వస్తున్న లారీ డీ కొట్టడంతో రేణుకకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి ఎస్సై వెంటనే చేరుకొని ఆమెను స్వయంగా 108 వాహనం ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.



