Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 24 2026(ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రీపోటర్ )

అత్యంత దారుణమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ కార్యదర్శి దళితరత్న సాతూరి వెంకన్న మాదిగ తీవ్రంగా ఖండించారు. మంగళవారం మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి దర్శనం కోసం వెళ్లిన రజక కుటుంబంపై గ్రామ సర్పంచ్‌తో పాటు కొందరు వ్యక్తులు దాడి చేసి అమానుషంగా ప్రవర్తించడం దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనలో రెండు నెలల పసిపాప మృతికి కారణమైన నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.దళితులు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందని సాతూరి వెంకన్న మాదిగ విమర్శించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని దోషులపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు