Listen to this article

జనం న్యూస్ 25 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

ఈరోజు అలంపూర్ నియోజకవర్గం ఐజ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో జరిగిన ఘటన అత్యంత దుర్మార్గం. కాంగ్రెస్ సర్పంచ్ అతని వర్గీయులు చాకలి చంద్రకళ అనే మహిళ కుటుంబ పైన అధికార బలం, అగ్ర కుల అహంకారంతో దాడి చేసి రెండు నెలల పసిపాపను కాళ్లతో తన్ని చంపిన ఆ ఎనిమిది మంది నిందితులపై తక్షణమే మర్డర్ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించి కఠినమైన చర్యలు తీసుకోవాలని మరియు ఆ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని రజక సంఘం ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో వివిధ పార్టీల ప్రజా సంఘాల, అఖిల పక్ష నాయకులతో కలిసి నిరసన తెలపడం జరిగింది.