జనం న్యూస్ ఫిబ్రవరి 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండలంలోని మాందరిపేట స్టేజి వద్ద ఆరేయ్య్ అండ్ ఆలైన్ ప్రోగ్రాంలో భాగంగా శాయంపేట ఎస్సై జక్కుల పరమేశ్వర్ ఆధ్వర్యంలో ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల ఏసీపీ సతీష్ బాబు హాజరై హెల్మెట్ పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని తెలియజేశారు సురక్షితంగా మీ యొక్క గమ్యాలకు చేరుకోవాలని మీ భద్రత మా బాధ్యత అని అన్నారు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చెయ్యకూడదు మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అలాగే మీ యొక్క ఇతరులకు ఇస్తే ప్రమాదవశాత్తు ఏమైనా ప్రమాదమైనచో వాహనాం ఎవరిది అయితే ఉంటుందో వారి పైనను నడిపిన వారి పైనను కేసు నమోదు అవుతుంది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 75% ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని పదివేల రూపాయలతో కొనుక్కున్న మొబైల్ కి చూపించే భద్రత మన ప్రాణాలకి ఎందుకు చూపించడం లేదు అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సీఐ సంతోష్ కుమార్ శాయంపేట మండలం రిపోర్టర్ లు కానిస్టేబుల్స్ సతీష్ నరేష్ శ్రీశైలం పోలీస్ సిబ్బంది మాందారిపేట సర్పంచ్ కుక్కల సరోజన చలివాగు ప్రాజెక్టు డైరెక్టర్ కుక్కల తిరుపతి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు….


