Listen to this article

.జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ శివకుమార్

పెబ్బేరు ఫిబ్రవరి 25 తమపై నమ్మకంతో గెలిపించినందుకు అనుక్షణం మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని *పెబ్బేరు మున్సిపాలిటీ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ గారు అన్నారు.**ఆయన మాట్లాడుతూ.* వార్డులో నెలకొన్న సిసి రోడ్లు డ్రైనేజీలు విద్యుత్ దీపాలు తాగునీటి వంటి తదితర సమస్యలు ఉన్నాయి సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మించాల్సి ఉంది ప్రతి వార్డులో పర్యటించి సమస్యలను గుర్తిస్తా వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా వార్డులను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటాను రానున్న ఐదేళ్లలో వార్డులో సమస్య అన్నది లేకుండా చేయడమే నా ముందున్న ప్రధాన లక్ష్యం.మున్సిపాలిటీలో ఎక్కడ ఎలాంటి ఏ సమస్య ఉన్న వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సమస్య పరిష్కారం కోసం పాలకవర్గ సభ్యుల సమన్వయంతో సలహా సూచనలు పాటిస్తూ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.పెబ్బేరు మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు ఈ కార్యాలయం కేవలం నాలుగు గోడల మధ్య నడిచేది కాదు ఇది ప్రజల కష్టాలను పంచుకునే వేదిక కావాలి నేను ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూనని ఆయన పేర్కొన్నారు .