Listen to this article

జనం న్యూస్:ఫిబ్రవరి 25 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా).

మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు త్వరలో దేశవ్యాప్తంగా యుక్త వయసు బాలికలందరికీ హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌ (హెచ్‌పీవీ) వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్నారు. రెండేండ్ల క్రితం కేంద్ర బడ్జెట్‌లో చేసిన వాగ్దానాన్ని ఈ ఏడాది అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రత్యేక టీకాను 14 సంవత్సరాలు దాటిన బాలికలకు ఉచితంగా అందించనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 2027 నాటికి దేశవ్యాప్తంగా 2.6 కోట్ల డోస్‌లను పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. వ్యాక్సిమ్‌ కూటమి ‘గావి’ ఒక కోటి డోసులను భారత్‌కు సరఫరా చేయనున్నదని అధికారులు పేర్కొన్నారు.