Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 25 సెల్ 9550978955

గత ప్రభుత్వంలో ఐదేళ్లలో 1,15,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రోడ్ల అభివృద్ధికి గతపాలకులు మొక్కుబడిగా రూ.10కోట్లు కేటాయించారు. అమరావతి అనంతపురం ఎక్స్ ప్రెస్ వేసహా రాష్ట్రంలోని ప్రధాన రోడ్లను గాలికి వదిలేశారు.కూటమిప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే రాష్ట్రంలోని రోడ్లను గుంతలరహితంగా మార్చింది.తాజా బడ్జెట్లో రోడ్ల అభివృద్ధికి రూ.9,900 కోట్లు కేటాయించి.. ప్రజాభద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చింది.చిలకలూరిపేట-నరసరావుపేట రోడ్డు విస్తరణ చేపట్టాలి.ఎన్ హెచ్ 16 బైపాస్ మొత్తం పూర్తయితేనే ప్రజల సమస్యలు తీరతాయి.జాతీయ రహదారి 167 ఏ నిర్మాణ టెండర్లు పిలిచారు.. పనులు ప్రారంభించలేదు.శాసనసభలో మాజీమంత్రి ప్రత్తిపాటి.గత పాలకులు గుంతలమయంగా మార్చిన రాష్ట్ర రోడ్లను కూటమిప్రభుత్వం కేవలం 9 నెలల్లోనే గుంతలరహితంగా తీర్చిదిద్దిందని, తాజా బడ్జెట్ లో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.9,900 కోట్లు కేటాయించిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారుబుధవారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్ బీ రోడ్ల దుస్థితి ప్రజల కష్టాలు అనే అంశంపై ప్రత్తిపాటి మాట్లాడారు.గత ప్రభుత్వపాలనలో ఐదేళ్లలో 1,15,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, 43వేల మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని, ఇంత ప్రాణనష్టం జరిగినా నాటి పాలకులు రహదారుల నిర్మాణానికి కేవలం రూ.10 కోట్లే కేటాయించి చేతులు దులుపుకున్నారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 6,534 కిలోమీటర్ల మేర కొత్త రహదారుల నిర్మాణానికి ఏఐఐబీతో చేసుకున్న ఒప్పందాన్ని కూడా జగన్ రద్దు చేశారని చెప్పారు. అమరావతి అనంతపురం ఎక్స్ ప్రెస్ వే, అమరావతి రింగ్ రోడ్ నిర్మాణం సహా రాష్ట్రంలో దెబ్బతిన్న 30 వేల కిలోమీటర్ల రహదారుల దుస్థితికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.కూటమి ప్రభుత్వం వచ్చాకే రోడ్లకు మహర్దశ
కూటమిప్రభుత్వం వచ్చాకే రాష్ట్రంలోని రోడ్లకు మహర్దశ వచ్చిందని, చంద్రబాబు నాయకత్వంలో రోడ్లు బాగా నిర్మిస్తారని ప్రజల్లో నానుడి ఉందని, ఈ పరిస్థితుల్లో నిధుల కొరత ఉన్నా కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. చంద్రబాబు కృషితో రాష్ట్రంలో రూ.70వేల కోట్లకు పైగా హైవేపనులు జరుగుతున్నాయన్నారు. బడ్జెట్ లో కేటాయింపులు చూస్తే రాష్ట్రంలో ఎక్కడా గుంతలనేవి లేకుండా రోడ్లు ప్రజలకు అందుబాటులోకి వస్తాయనే నమ్మకం ఏర్పడుతోందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రధాన మార్గాలైన రోడ్ల నిర్మాణంపై కూటమిప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు.అధిక లోడు వాహనాలు తిరిగే రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక డీపీఆర్ లు
భారీ బరువులు ఉన్న వాహనాలు తిరిగే మార్గాల్లోనే ఎక్కువగా రోడ్లు దెబ్బతింటున్నాయని, అధిక లోడు వల్ల కొత్త రోడ్లు వెంటనే పాడైపోతున్నాయని ప్రత్తిపాటి తెలిపారు. అందువల్ల అటువంటి వాహనాలు తిరిగే రోడ్లు రెట్టింపు నాణ్యతతో, అధిక లోడును తట్టుకునేలా నిర్మించాలని ప్రత్తిపాటి సూచించారు. ఆ విధమైన రోడ్ల నిర్మాణ వ్యాల్యుయేషన్ ను కూడా పెంచాలన్నారు. ఆ విధమైన రోడ్లను ప్రత్యేక కేటగిరీగా విభిజించి, వాటి నిర్మాణానికి ప్రత్యేక డీపీ ఆర్ లు తయారుచేస్తే బాగుంటుందని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. ఈ సమస్యపై రహదారులు భవనాల శాఖ మంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.ఎన్ హెచ్ 167ఏ టెండర్లు పిలిచారు పనులు ప్రారంభం కాలేదుచిలకలూరిపేట నియోజకవర్గంలో పలు ప్రధాన రోడ్లను విస్తరించాల్సి ఉందని, పెరిగిన ట్రాఫిక్ సమస్యల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రత్తిపాటి తెలిపారు. ప్రజల ప్రాణాల భద్రతకు ప్రాధాన్యమివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంఫై, తనపై ఉందన్నారు. చిలకలూరిపేట నరసరావుపేట రోడ్లు విస్తరణ చేపట్టాలని, ఎత్తుకూడా పెంచాలని సూచించారు. ఎన్.హెచ్ 167 ఏ నిర్మాణానికి టెండర్లు పిలిచి ఇంకా పనులు ప్రారంభించలేదని, భూసేకరణకు సంబంధించిన పరిహారం ఇంకా అందలేదని, సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రత్తిపాటి సభాముఖంగా ప్రభుత్వాన్ని కోరారు.చౌడవరం కొండవీడు రోడ్డుకు ముఖ్యమంత్రి కూడా సుముఖత వ్యక్తంచేశారు 2019 ఫిబ్రవరిలో నాటి, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు చౌడవరం (ఎన్ హెచ్-16) నుంచి ప్రఖ్యాత పర్యాటక కేంద్రం కొండవీడు కోటకు 5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారని ప్రత్తిపాటి చెప్పారు. కొండవీడు కోట ఘాట్ రోడ్డును అనుసంధానించే ఈ రోడ్డు నిర్మాణం యొక్క ఆవశ్యకతను గుర్తించి ప్రభుత్వం వెంటనే దీన్ని పూర్తిచేయాలని ప్రత్తిపాటి విజ్ఞప్తి చేశారు. ఈ రోడ్డు అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారని ప్రత్తిపాటి తెలిపారు. అలానే నియోజకవర్గంలోని సింగిల్ లైన్ రోడ్లను డబుల్ లైన్లుగా మార్చాలన్నారు. చిలకలూరిపేట కోటప్పకొండ (వయా నరసరావుపేట) మార్గంలో అధిక ట్రాఫిక్ ఉంటోందని, ముఖ్యంగా శివరాత్రి తిరునాళ్ల సందర్భంలో ఊహించన విధంగా ప్రజల తాకిడి ఉంటుందని, ఈ నేపథ్యంలో ఈ రోడ్డు విస్తరణపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలన్నారు. ఓగేరు నుంచి గణవపరం బ్రిడ్జి వరకు వాగుపై రెండువైపులా నిర్మించాల్సిన డ్రెయిన్ల నిర్మాణం కూడా పెండింగ్ లో ఉందని ప్రత్తిపాటి సభద్వారా ప్రభుత్వానికి తెలియచేశారు. చిలకలూరిపేట వేలూరు మధ్య వరద తాకిడితో అధిక ప్రమాదాలు చోటుచేసుకుంటున్న బ్రిడ్జి నిర్మాణం వెంటనే పూర్తిచేయాలన్నారు.ఎన్ హెచ్ 16 బైపాస్ మొత్తం పూర్తయితేనే సమస్యలు తీరతాయి 2014-19లో కేటాయించబడిన ఎన్ హెచ్ 16 జాతీయ రహదారి బైపాస్ నిర్మాణం పూర్తైందికానీ.. అనుబంధంగా ఉన్న సర్వీస్ రోడ్లు, అండర్ పాసులు పూర్తి చేయాల్సి ఉందని ప్రత్తిపాటి తెలిపారు. భారత్ మాల పరియోజన కింద హైబ్రీడ్ యాన్యుటీ మోడ్ లో చేపట్టిన ఎన్.హెచ్ 16 బైపాస్ యొక్క నిర్మాణాన్ని సంపూర్ణం చేయాలని, అప్పుడే ప్రజల సమస్యలు తీరతాయని ప్రత్తిపాటి పేర్కొన్నారు. బైపాస్ నిర్మాణంలోని లోపాల వల్ల పట్టణంలోని కొన్ని ప్రాంతాలు నీటమునుగుతున్నాయన్నారుఅన్నింటికంటే ముందు జాతీయ రహదారి విస్తరణకు భూములిచ్చిన రైతులకు తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని ప్రత్తిపాటి సభద్వారా ప్రభుత్వాన్ని కోరారు.