Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 25 సెల్ 9550978955

బుధవారం రాష్ట్ర శాసనసభలో విద్యార్థుల సందడి కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు.సభ నిర్వహణ తీరు, ప్రజాప్రతినిధుల చర్చలు, నిర్ణయాల ప్రక్రియను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా గమనించారు.శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూడటం తమకు ఎంతో ప్రేరణనిచ్చిందని విద్యార్థులు తెలిపారు.ఈ అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నరసరావుపేట పట్టణానికి చెందిన ఒకలాండ్ స్కూల్ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. స్కూల్ చైర్మన్ హనుమంతరావు ఈ అవకాశానికి నరసరావుపేట ఎమ్మెల్యే డా చదలవాడ అరవింద బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.విద్యార్థులతో కలిసి మంత్రి సవితమ్మ మరియు ఎమ్మెల్యే డా చదలవాడ అరవింద బాబు మాట్లాడి, వారి భవిష్యత్తు లక్ష్యాలపై ప్రోత్సాహం అందించారు.ప్రజాస్వామ్య వ్యవస్థ పై అవగాహన పెంపొందించుకోవాలని,భవిష్యత్తులో సమాజానికి సేవ చేసే నాయకులుగా ఎదగాలని ఎమ్మెల్యే డా చదలవాడ విద్యార్థులకు సూచించారు.ఈ సందర్శనం విద్యార్థుల్లో ప్రజాస్వామ్యంపై అవగాహన పెంచి, ప్రజాసేవ పట్ల ఆసక్తిని పెంచేలా నిలిచింది.