Listen to this article

విజయవంతం అలరించిన ఘంటసాల సంగీత విభావరి

జనం న్యూస్ ఫిబ్రవరి 25 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నవ్యాంధ్ర చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ ශධි లీలా ఫౌండేషన్ తెలుగుకళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ కౌతావారి కళావేదికలో 15వ జాతీయ మహాసభలు ప్రారంభ. కార్యక్రమాలు. ఘనంగా ప్రారంభమైనాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ కర్ణాటక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి ప్రముఖులు ప్రతినిధులు హాజరైనారు. అది లీలా ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు న్యూఢిల్లీ డాక్టర్ ఎస్ ఆదినారాయణ తెలుగు భాష ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ తెలుగు భాష గొప్పదనం అజరామరమైనది. మన మాతృభాష తెలుగు భాష కు ఎదురవుతున్న సవాల నుండి కాపాడి భవిష్యత్ తరాలకు అందించడమే ప్రభుత్వ ప్రజలందరి కర్తవ్యం అన్నారు. నవ్యాంధ్ర చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు,ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు కోట వెంకటేశ్వరరెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ నవ్యాంధ్ర నాడు నేడు రేపు అనే అంశంపై 15వ జాతీయ మహాసభలను రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ప్రారంభించి ఈ 2026 లో 30 కేంద్రాల్లో ప్రత్యక్షంగాను ఆహ్వాన కమిటీలు ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్తమానం భవిష్యత్తు గురించి ప్రజల్లో చైతన్య కలిగించేందుకు నవ్యాంధ్ర రాష్ట్ర సాంస్కృతిలో చైతన్య కళాయాత్ర ప్రచార కార్యక్రమాలు ఈ 2026లో విస్తృతంగా నిర్వహిస్తామన్నారు. 100 కేంద్రాల్లో పరోక్షంగానూ, అమరావతి నవ్యాంధ్ర నాడు నేడు రేపు కార్యక్రమాలు అలాగే ఘంటసాల చైతన్య వేదిక సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.15వ జాతీయ మహాసభలను రాష్ట్ర రాజధాని ప్రాంతం గుంటూరు విజయవాడ తుళ్లూరు మంగళగిరి ఇబ్రహీంపట్నం ప్రాంతాలలో ప్రారంభకార్యక్రమాలు కమిటీలు నిర్మాణం చేస్తున్నాము నవ్యాంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు విజ్ఞప్తులుబ్యానర్ను, అమరావతి నవ్యాంధ్ర నాడు నేడు రేపు 15వ జాతీయమహాసభల అధ్యయన పత్రాలను సభలో పాల్గొన్న ప్రముఖులందరూ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఆది లీల ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎస్ ఆదినారాయణ. ఆధ్వర్యంలో ప్రముఖులకు సత్కార కార్యక్రమం జరిగింది కర్ణాటక బెంగళూరు నుంచి విచ్చేసిన శ్రీ సూర్య ప్రసాద్ సీనియర్ నాయకులు 84 సంవత్సరాలు ప్రత్యేక సత్కారం జరిగింది.. అలాగే వేల్పూరి శ్రీనివాసరావు బాకీ బైరెడ్డి తెలంగాణ కొంకటి రవి బాబు తెలంగాణ జి ఎస్ ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు గ్రంధి శ్రీనివాసరావు గుంటూరు తదితరులకు సత్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గాయని గాయకులు కోట వెంకటేశ్వర రెడ్డి, త్రివేది రాంబాబు వెంకట్, రమీజాబీ, సుమలత, మీనా కుమారి, ఘంటసాల సుశీల, ఎస్పీ బాలసుబ్రమణ్యం జానకి గాయకులు ఆలపించిన గీతాలను పాడి ప్రేక్షకులను ఆనందింపజేశారు