జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 25 సెల్ 9550978955
చలో విజయవాడ కార్యక్రమంలో చిలకలూరిపేట మండలం ఎడ్లపాడు నాదెండ్ల మండలాలు మరియు చిలకలూరిపేట పట్టణానికి సంబంధించి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై ధర్నాలో పాల్గొని విజయవంతం చేశారు ఈ సందర్భంగా ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే కోటేశ్వరరావు ఎస్టీయు డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నాయకులను చర్చలకు పిలిపించి ఉపాధ్యాయుల ఉద్యోగుల అపరిచితుల సమస్యలు పరిష్కరించాలని లేనిచో ఉద్యమాన్ని జేఏసీతో ఉధృతం చేస్తామని తెలిపారు ముఖ్యంగా పిఆర్సి కమిషన్ నిర్మించాలని 30 శాతం మధ్యంతర అభివృద్ధి ప్రకటించాలని పెండింగ్ బకాయిలు 32 వేల కోట్లు జమ చేయాలని ఉపాధ్యాయులపై పని ఒత్తిడి భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. మాజీ శాసన మండల సభ్యులు ప్రతి నరసింహారెడ్డి సిపిఐ పార్టీ కార్యదర్శి ఈశ్వరయ్య జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్న ఈ సమావేశంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు బొంత రవికుమార్,జిల్లా ప్రధాన కార్యదర్శి వినుకొండ అక్కయ్య , జిల్లా ఉపాధ్యక్షులు డి శ్రీనివాసరావు పట్టణ ప్రధాన కార్యదర్శి వడ్లాన జయప్రకాష్. నాదెండ్ల మండల అధ్యక్షులు షేక్ మక్బూల్ బాషా చిలకలూరిపేట మండల అధ్యక్షులుషేక్ మస్తాన్ వలి కార్యదర్శి వి రమణా నాయక్ ఎడ్లపాడు మండల అధ్యక్షులు జి కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ నరేష్ నాయక్ శ్రీను నాయక్ కృష్ణమూర్తి సిహెచ్ ఉమా ప్రవీణ కోటేశ్వరమ్మ ఎస్ టి యు సీనియర్ నాయకులు చావలి మల్లేశ్వరరావు, 65,మంది కి పైగా పాల్గొన్నారు


