జనం న్యూస్ ఫిబ్రవరి 25 ముమ్మిడివరం ప్రతినిధి
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు..
ఈ ప్రాంతం యానాం సరిహద్దులో ఉండటం వల్ల మద్యం, పెట్రోలు,డీజిల్ స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది వీటిని పూర్తగా అరిడతాం..
అలాగే ఈ ప్రాంతం హైవే ప్రాంతం కావడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ట్రాఫిక్ అధికంగా ఉండే పాత ఇంజరం – ఎదుర్లంక బ్రిడ్జి, కొమరగిరి ప్రాంతాలను ప్రమాదకరమైన ‘బ్లాక్ స్పాట్స్’గా గుర్తించారు. గత మూడేళ్లలో ఇక్కడ 24 మంది మరణించగా, ప్రమాదాల తగ్గింపునకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశాము…మరొక ముఖ్యవిషయం గోదావరినదిలో దూకి చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, గోదావరి వంతెనపై ఆత్మహత్యలను నిరోధించడానికి 52 సీసీ కెమెరాలు, మెరుగైన లైటింగ్ ఏర్పాటు చేశాము. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు పెట్రోలింగ్ మరియు అవగాహన బోర్డులను ఏర్పాటు చేస్తున్నాము..చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి, సస్పెక్ట్ షీట్లు తెరిచాము. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని జరిగే ఇటువంటి నేరాల పట్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాము..గంజాయి స్మగ్లింగ్ ను పూర్తిగా అడ్డుకున్నాము. గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకున్నామని అన్నారు..ఈ పర్యటనలో ఆయన వెంట డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్.పి రాహుల్ మీనా, అమలాపురం డి.ఎస్.పి టి.ఎస్.ఆర్.కె ప్రసాద్. ముమ్మిడివరం సిఐ మోహన్ కుమార్, స్దానిక ఎస్.ఐ సిబ్బంది పాల్గొన్నారు…..



