జనం న్యూస్ ఫిబ్రవరి 25: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన పసుల రేవతి–జనార్ధన్ ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బుధవారం రోజునా ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి గృహ ప్రవేశ కార్యక్రమం ప్రారంభించారు. ఇంటి యజమాని సునీల్ కుమార్ కు రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం పేదల సొంతింటి కలను నెరవేర్చే గొప్ప సంక్షేమ కార్యక్రమమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, పేదల జీవితాల్లో వెలుగులునింపుతోందన్నారు.ప్రత్యేకంగా ఏర్గట్ల మండలంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. పేదలకు గౌరవంగా జీవించే హక్కు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, ఇందిరమ్మ ఇండ్లు అందుకు నిదర్శనమన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతోందని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఆదరిస్తున్న ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సోమ దేవరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు శివ్వన్నోళ్ల శివకుమార్,నాయకులు, కార్యకర్తలకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



