Listen to this article


జనం న్యూస్ 26 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

నాగర్ కర్నూల్ జిల్లాలో రజక చిన్నారి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోకుండా, బాధితులను వేధిస్తున్న పోలీసులపై హత్యానేరం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ లో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మేర జాతరలో దైవ దర్శనం కోసం వెళ్ళిన రజక మహిళను అడ్డుకొని అసభ్య పదజాలం తో దూషించడమే కాకుండా, 2 నెలల చిన్నారిని అత్యంత కిరాతంగా చంపిన పెత్తందారులకు పోలీసులు వత్తాసు పలకడం ఏమిటని ప్రశ్నించారు. దేవాలయ శాఖ అనుమతి లేకుండా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న పెత్తందారులను ప్రశ్నించిన పాపానికి పాల్పడ్డ ఈ ఘాతకానికి కారకులైన పెత్తందారులను శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు. బాధింపబడ్డ రజకులు దళితులపై అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు ఇచ్చిన పిర్యాదును పక్కన పెట్టి, అగ్రకులాలూ ఇచ్చిన పిర్యాదుల ఆదరంగా కేసులు నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు.దాడి చేసిన అగ్ర కుల పెత్తందారులకు స్థానిక ప్రజా ప్రతినిధులకు అండగా నిలుస్తూ మానసికంగా భౌతికంగా దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. బాధితులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని సైతం నిలుపుదల చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసు శాఖ సిగ్గు లేకుండా కుల దురహంకారుల పక్షాన నిలుస్తూ, భవిష్యత్తులో జరిగే కుల దాడులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ప్రతిఘటన పోరాటాల ద్వారా మాత్రమే రజకులు తమపై జరుగుతున్న దాడులను అడ్డుకొని కుల దురహంకారులకు బుద్ధి చెప్పాలన్నారు. వాస్తవంగా దాడులకు పాల్పడి చిన్నారి మృతి కారణమైన వారిని తప్పించి కేసును తప్పుదోవ పట్టిస్తున్న పోలీసులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.తక్షణమే దాడికి పాల్పడ్డ తుకారాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి లను అరెస్టు చేయాలని అగ్రకుల పెత్తందారులకు వత్తాస పలికిన ఎస్సై, సీఐ ల పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి, విధుల నుండి తొలగించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ,నాయకులు తిరుపతన్న,రామక్రిష్ణ, రంగన్న, రామాంజనేయులు, సూర్య, విష్ణు , వీరేష్,బాబన్న,తదితరులు పాల్గొన్నారు.ధన్యవాదాలతో ఏ వెంకటస్వామి సి పి యం జిల్లా కార్యదర్శి జోగులాంబ గద్వాల జిల్లా