Listen to this article

జనం న్యూస్ 26 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

నాగర్ కర్నూలు కుమ్మెర జాతరలో పసిపాప హత్య …మానవత్వానికే మచ్చ షాద్‌నగర్ చౌరస్తాలో న్యాయం చేయాలని నిరసన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ డిమాండ్ నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర జాతర సందర్భంగా చోటుచేసుకున్న చిన్నారి హత్య ఘటన రాష్ట్రాన్ని కలచివేస్తోందని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.
కుల దురహంకారానికి బలైన రెండు నెలల పసిపాప బేబీ మౌనిక మృతికి నిరసనగా, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ( ఏఐఎస్ఎఫ్ ) ఆధ్వర్యంలో షాద్నగర్ పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఏఐఎస్ఎఫ్ నాయకుడు ఆకాష్ నాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి డాక్టర్ సలహా బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తూ చిన్నారి పాప మృతి పట్ల కొవ్వొత్తుల ప్రదర్శన, కుల వివక్షకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బాధిత కుటుంబానికి తక్షణమే రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ షాద్‌నగర్ చౌరస్తాలో విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెరలో గుడిలో దర్శనం చేసుకునే అవకాశం కల్పించాలంటూ కోరిన అమాయక కుటుంబంపై దాడి చేసి, రెండు నెలల పసిపాపను హతమార్చడం అమానుషమని ఖండించారు.ఈ ఘటన మానవత్వానికే మచ్చ తెచ్చిందని, తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చిందన్నారు.పసిబిడ్డపై ఇంత క్రూరత్వం ప్రదర్శించడం దారుణమని, హంతకులకు అండగా నిలిచిన వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.కుల వివక్షను నిర్మూలించేందుకు మహనీయులు ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ, ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి దాడులు జరగడం బాధాకరమన్నారు. వివక్షను అరికట్టాల్సిన ప్రభుత్వాలే పరోక్షంగా కులవివక్షను పెంచి పోషిస్తున్నాయనే ఆరోపణలు చేశారు.బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం, నివాస సౌకర్యం కల్పించడంతో పాటు గ్రామంలో అవగాహన సదస్సులు, శాంతి సమావేశాలు నిర్వహించి కులవివక్ష నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.సమాజంలో సమానత్వం, మానవత్వం నిలబెట్టేందుకు అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆకాష్ నాయక్ పిలుపునిచ్చారు.కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి దోషులకు కఠిన శిక్షలు విధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు అనిల్ నాయక్,రాజేష్, అశోక్,కార్తీక్, నరేష్ తదితర విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు