Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 27

ఈరోజు తుమ్మలచెరువు గ్రామం తర్లపాడు మండలం మార్కాపురం జిల్లా లో ఉచిత మెడికల్ క్యాంపు ను ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి ఆధ్వర్యంలో నిర్వహించారు. కందుల ఓబుల్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున డెంటల్ , ఆప్తోలజీ, గైనొకాలజీ, మరియు జనరల్ విభాగానికి చెందిన డాక్టర్లు మరియు సిబ్బందులురావడం జరిగింది మరియు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ తరఫున కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ఉచితంగా ఓపి , రక్త పరీక్షలు మరియు మందులు ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగించారు. 242 ఓపీలు నవోదయాయి. ఈ కార్యక్రమం తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి తుమ్మలచెరువు గ్రామానికి వచ్చినటువంటి డాక్టర్లకుమరియు వైద్య సిబ్బంది లకు దృశ్యాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమం నిర్వహించిన కందుల ఓబుల్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యజమాన్యం వారికి మరియు ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ వారికి డాక్టర్ మహబూబ్ వలి కృతజ్ఞతలు తెలిపారు.ఈయన చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి జాతీయ ,అంతర్జాతీయ మరియు వివిధ రాష్ట్రాల ఎన్జీవోల 114 అవార్డులను స్వీకరించారు మరియు 22 డాక్టరేట్ అవార్డులను వివిధ సంస్థలు అందజేశాయి. ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ భారత ఉపాధ్యక్షులుగా మరియు సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సర్వీస్ ,కరప్షన్ ఫ్రీ ఇండియా ,యోగ్దానం సహారా సమితి , స్వర్నిమ్ భారత్ సమాజ్ కళ్యాణ్ ఫౌండేషన్, భారతీయ కిసాన్ యూనియన్ అమర్ టికెట్ ఈ ఐదు సంస్థలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. మరియు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు. డాక్టర్ షేక్ మహబూబ్ వలి మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతానని ఈ సందర్భంగా తెలియజేశారు.