Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

స్థానిక కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 28 మరియు మార్చి 01 తేదీలలో రెండు రోజుల పాటు 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు కిమ్స్, చైతన్య విద్యా సంస్థల స్థాపకుడు, అధినేత కె.వి.వి. సత్యనారాయణ రాజు (చైతన్య రాజు) తెలిపారు. గత రెండు ఏళ్లుగా ఈ సభలు రాజమహేంద్రవరం గైట్ విద్యా సంస్థల ప్రాంగణంలో జరగగా, ఈసారి కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో నిర్వహి స్తున్నారు.
​ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఈ సభలకు హాజరుకానున్నారు.​ ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు చాగంటి కోటేశ్వర రావు, గరికపాటి నరసింహారావు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.​వేదిక పేరు: తెలుగు జాతి ఖ్యాతిని చాటిన నందమూరి తారక రామారావు పేరును మహాసభల ముఖ్య వేదికకు ఖరారు చేశారు.​కార్యక్రమాలు: తెలుగు భాషా సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం, పద్య పఠనం, వేషధారణ, ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహించి నగదు బహుమతులు అందజేస్తారు.
​ఆధ్యాత్మిక నమూనాలు: భక్తుల దర్శనం కోసం అన్నవరం, భద్రాచలం, సింహాచలం, ద్వారకా తిరుమల, అయినవిల్లి దేవాలయాల నమూనాలను ఏర్పాటు చేశారు.​శుక్రవారం కిమ్స్ ప్రాంగణంలో భద్రాచలం నుండి వచ్చిన ఉత్సవ విగ్రహాలతో సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కిమ్స్ ఎం.డి కె.రవి కిరణ్ వర్మ, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ శశి కిరణ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.