Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 27-02-26

విశాఖపట్నం నందు గల సౌత్ కోస్ట్ రైల్వే (దక్షిణ కోస్తా రైల్వే) ఓ ఎస్ డి ని రాజంపేట భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి కలిసి ప్రపంచ దేశంలోనే అతి పెద్దదైనటు వంటి భారతదేశ రైల్వే సంస్థ నందు నూత నంగా ఏర్పడి నటువంటి సౌత్ కోస్ట్ రైల్వే కు నంద లూరు ప్రజల నుండి శుభాకాంక్షలు తెలపడం జరిగినది అలాగే సౌత్ కోస్ట్ రైల్వే అత్యున్నత అధికారి ఓ ఎస్ డి తో నందలూరు మండల రైల్వే స్టేషన్ చాలా ప్రాచీనకర మైనటు వంటి అతి పెద్ద రైల్వే స్టేషన్ గా ఉన్నదని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ట్రైన్ స్టాపింగ్స్ కూడా లేవని తెలపడం జరిగినది కావున దయవుంచి సౌత్ కోస్ట్ రైల్వే అధికారులు నందలూరు రైల్వే స్టేషన్ కి ఒక కిలోమీటర్ దూరంలోస్వచ్ఛమైనటువంటి బహుదానది లో భాగమైనటు వంటి చెయ్యేరు నది ప్రవహిస్తూ ఉన్నదని ఆ యొక్క చెయ్యేరు లో అను నిత్యం స్వచ్ఛమైనటు వంటి నీరు లభ్యమవుతూ ఉంటుందని కనుక చెన్నై మరియు ముంబై కి వెళ్లే ట్రైన్లు మరియు సుదూర ప్రాంతాలకు వెళ్లే ట్రైన్లకు వాటరింగ్ సౌకర్యం సమృద్ధిగా లభ్యమవుతుంది అని కనుక నందలూరు రైల్వే స్టేషన్ లో వాటరింగ్ పాయింట్ పెట్టాలని కోరడమైనది అని అలాగే హైదరాబాద్ మరియు చెన్నై నగరాలకు పోయే ట్రైన్ ల స్టాపింగ్ ఇవ్వవలసిందిగా కోరడమైనది దీనికి స్పందించి నటువంటి రైల్వే అత్యున్నత అధికారి ఓ ఎస్ డి బి చంద్ర శేఖర్ మాట్లాడుతూ ఈ యొక్క సమాచారాన్ని పరిశీలనలోకి తీసుకొని ఖచ్చితంగా నంద లూరు రైల్వే స్టేషన్ కు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది ఇందుకు గాను నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ మెంబర్ సౌత్ కోస్ట్ రైల్వే ఓ ఎస్ డి బి చంద్రశేఖర్ కి కృతజ్ఞతలు తెలపడం జరిగినది.