జనంన్యూస్. 27. సిరికొండ. శ్రీనివాస్ పటేల్.
సిరికొండ మండలం లొని గడ్కోల్ గ్రామ పరిధిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్న ఒక జెసిబి మరియు ఒక ట్రాక్టర్‌ను పట్టుకొని సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగింది. వాహనాలను సీజ్ చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు ప్రారంభించబడినవి.సిరికొండ మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా, ప్రభుత్వ అనుమతులు లేకుండా వాగులు మరియు ఇతర ప్రదేశాలలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేయడం చట్ట విరుద్ధం. ఇటువంటి కార్యకలాపాలలో పాల్గొనే వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడును.


